చిరు కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేసిన కొరటాల!
- సందేశాన్ని వీడని కొరటాల
- ‘ఠాగూర్’ తరహా కథ
- నిర్మాతగా రామ్ చరణ్
అయితే చిరుతో తెరకెక్కించబోయే చిత్రంలోనూ కొరటాల సందేశాన్ని వీడలేదని తెలుస్తోంది. గతంలో మెగాస్టార్.. ‘ఠాగూర్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కొరటాల కూడా ఇదే తరహా పవర్ఫుల్ కథాంశాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘సైరా’ చిత్రం మార్చి నెలాఖరుకి చిత్రీకరణ పూర్తవుతుందని.. అనంతరం చిరు, కొరటాల చిత్రం సెట్స్‌పైకి వస్తుందని సమాచారం.