పంచమి రోజే మంచిదని.. గెలిచేది ఎవరైనా ముహూర్తం బుధవారమే!
- రేపటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూపు
- కూటమి గెలిస్తే కాంగ్రెస్‌కే సీఎం పీఠం
- గెలిచిన సీట్లు ఆధారంగా మంత్రి పదవుల పంపకం
కూటమి, టీఆర్ఎస్లలో ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం 12నే. బుధవారం పంచమి కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో బుధవారమే ప్రమాణ స్వీకారం కానిచ్చేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కూటమి కనుక విజయం సాధిస్తే మంగళవారమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. 12న ఆ నేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. కూటమిలోని పార్టీలు గెలిచిన సీట్లను బట్టి మంత్రి పదవుల పంపకం ఉంటుందని సమాచారం.