తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

05-12-2018 Wed 18:59 | Telangana
  • హైదరాబాద్ లో అత్యధికంగా 3,873 
  • వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 280 పోలింగ్ కేంద్రాలు
  • ఎన్నికల విధుల నిమిత్తం 1,60,509 మంది సిబ్బంది
ఈ నెల 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. హైదరాబాద్ లో అత్యధికంగా 3,873, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 280 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఇక ఎన్నికల విధుల నిమిత్తం 1,60,509 మంది సిబ్బందిని, 649 మంది సహాయక రిటర్నింగ్ అధికారులను కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం 31 జిల్లాల్లో 29,541 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఈ నెల 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉన్నారు.  

ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన  అభ్యర్థులు 1,821 

తెలంగాణలోని  119 నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఈసీ పేర్కొంది. మల్కాజ్ గిరిలో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 15 మంది అభ్యర్థులకు పైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 25 కాగా, 16 నుంచి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య 78. ఇక 32 మంది అభ్యర్థులకు పైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 16 అని ఈసీ స్పష్టం చేసింది.
Telanganaelectionselection commission

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more