తెలంగాణను ముంచేసి మిగులు బడ్జెట్ సాధించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి
- ఏపీలో దారుణమైన పాలన సాగుతోంది
- టీడీపీ నేతలు బందిపోటుల్లాగా తయారయ్యారు
- ఒక్క పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదు
ఏపీలో బాబు ప్రభుత్వం ఒక్క కాలువ తవ్వలేదనీ, ఒక్క పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదని వ్యాఖ్యానించారు. అయినా వేర్వేరు రూపాల్లో రూ.లక్ష కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తికాకపోయినా నగదును మాత్రం ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సాయిరెడ్డి స్పందించారు.