లేడీస్ హాస్టల్ యాజమాన్యం నిర్వాకం... రహస్య కెమెరాలు అమర్చి చిత్రీకరణ!

05-12-2018 Wed 10:18 | National
  • చెన్నైలోని ఆదంబాక్కం ప్రాంతంలో ఘటన
  • అన్ని గదుల్లో కెమెరాలు అమర్చిన యజమాని సంపత్ రాజ్
  • అమ్మాయిలకు అనుమానం రావడంతో బట్టబయలు
చెన్నైలోని ఓ లేడీస్ హాస్టల్ బాత్ రూముల్లో రహస్య కెమెరాలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదంబాక్కం పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తిల్లై గంగా నగర్ లో సంపత్ రాజ్ (48) అనే వ్యక్తి లేడీస్ హాస్టల్ నిర్వహిస్తుండగా, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగినులు ఇక్కడ ఉంటున్నారు. బాత్ రూములు, హాల్స్ లోని ఎలక్ట్రికల్ సాకెట్లు, కర్టెన్ రాడ్లు తదితర ప్రాంతాల్లో సంపత్ రాజ్ రహస్యంగా కెమెరాలు అమర్చి, వాటి ద్వారా అమ్మాయిల దృశ్యాలను చిత్రీకరించాడు.

రూములను తనిఖీలు చేయడానికి అంటూ తరచూ అతను యువతుల గదుల్లోకి వచ్చిపోతూ ఉండటం, అతను వచ్చిన సమయంలో తమను బయటకు వెళ్లాలని ఆదేశిస్తుండటంతో హాస్టల్ లో బస చేస్తున్న వారికి అనుమానం వచ్చింది. గదుల్లో రినోవేషన్ వర్క్ ఉందని తమకు చెబుతూ, కెమెరాలు అమర్చుతుండేవాడని గుర్తించిన వారు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, హాస్టల్ గదుల్లో అమర్చిన కెమెరాలను, వాటి ఫుటేజీలను స్వాధీనం చేసుకుని సంపత్ రాజ్ ను అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే ఈ హాస్టల్ ను సంపత్ రాజ్ ప్రారంభించాడని, ఇక్కడ ఆరుగురు ఐటీ ఉద్యోగినులు, ఓ నర్సు బస చేస్తున్నారని తెలిపారు.

డిసెంబర్ 2వ తేదీన ఓ యువతి తన ఆండ్రాయిడ్ ఫోన్ లో 'హిడెన్ కెమెరా డిటెక్టర్' అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుందని, దానితో చెక్ చేయగా, బాత్ రూములో అమర్చిన రహస్య కెమెరా కనిపించిందని వెల్లడించారు. ఆపై తమకు వారు ఫిర్యాదు చేశారని, తమ దాడిలో మొత్తం 9 కెమెరాలు బయటపడ్డాయని తెలిపారు. నిందితుడి ల్యాప్ టాప్ లో హాస్టల్ విద్యార్థుల నగ్న దృశ్యాలున్నాయని, అతన్నుంచి 18 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. సంపత్ రాజ్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
TamilnaduChennaiAdambakkamLadies Hostel

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more