కేసీఆర్ లో పెరుగుతున్న ఆగ్రహం... కారణమేంటో చెప్పిన చంద్రబాబు!

05-12-2018 Wed 10:04 | Both States
  • కేసీఆర్ కు ఓటమి భయం
  • ఆందోళనతోనే ఆగ్రహం వస్తోంది
  • కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు
ఇటీవల కొన్ని సభల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనానికి గురవుతూ, కార్యకర్తలు, నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటాన్ని చంద్రబాబునాయుడు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో ఓటమి భయం పట్టుకుందని, ఓడిపోతున్నామన్న ఆందోళనతోనే ఆయన అసహనంతో కోపాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

 నిన్న రాత్రి కుత్బుల్లాపూర్ లో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని అన్నారు. కూటమి నాయకుల సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే, కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తానేమీ కేసీఆర్ కోసం రాలేదని, తెలంగాణ ప్రజల కోసమే వచ్చానని చెప్పిన చంద్రబాబు, కేవలం తనను తిట్టేందుకు మాత్రమే కేసీఆర్ సభలను పెడుతున్నారని అన్నారు.

ఈ రెండు రోజులూ డబ్బు సంచులతో టీఆర్ఎస్ నాయకులు వస్తారని, తమను ఎవరూ కొనలేరని ఓటర్లు చెప్పాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను ప్రణాళికలు వేస్తే, కాంగ్రెస్ పార్టీ వాటిని కొనసాగించి పూర్తి చేసిందని, కేసీఆర్ ఒక్క చిన్న పని కూడా చేయలేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన వద్ద పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు తననే బెదిరిస్తున్నారని, ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాలనావకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారని అన్నారు.
ChandrababuKCRTelanganaElections

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more