100 కోట్లు రాబట్టేసిన '2.ఓ' హిందీ వెర్షన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కోట్లు రాబట్టేసిన '2.ఓ' హిందీ వెర్షన్

  • తొలి రోజున 100 కోట్లు 
  • నాలుగు రోజుల్లో 400 కోట్లు 
  • చెన్నైలో కొనసాగుతోన్న జోరు     
రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ తెరకెక్కించిన '2.ఓ' .. నవంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లో 400 కోట్లను రాబట్టింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా ఈ మూడు భాషల్లోను దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ మరింత వేగంగా వసూళ్లను సాధిస్తోంది.

బాలీవుడ్లో ఈ సినిమా నిన్న ఒక్క రోజునే 14 కోట్ల షేర్ ను సాధించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. 5 రోజుల్లో హిందీ వెర్షన్ 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తమిళ అనువాద చిత్రానికి బాలీవుడ్లో ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే మొదటిసారి. ఇలా బాలీవుడ్లో 5 రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన తొలి తమిళ అనువాద చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించింది. ఇక చెన్నై నగరంలోనూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది.   
rajani
akshay

More Telugu News