మహిళకు లైంగిక వేధింపులు.. ఎదురుతిరిగిందని పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!

03-12-2018 Mon 15:32 | National
  • ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఘటన
  • బాధితురాలికి 60 శాతం కాలినగాయాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ మహిళను వెంటపడి వేధించిన కామాంధులు ఆమె తిరగబడటంతో రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో 60 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటుచేసుకుంది.

సీతాపూర్ లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్న ఓ మహిళను అదే ప్రాంతానికి చెందిన రాము, రాజేశ్ లు కొంతకాలంగా వేధిస్తున్నారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తిరగబడింది. దుండగుల నుంచి తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించేందుకు సీతాపూర్ పోలీసులు నిరాకరించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయగా, అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.

ఈ నేపథ్యంలో ఇంకోసారి సీతాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అధికారులు ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబం మనస్తాపంతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికెళ్లిన దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స ప్రారంభించారు.

మరోవైపు  ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిందితులపై లైంగికవేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాము, రాజేశ్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
Uttar PradeshPolicesexual harrasmentpetrolbrunt

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more