కిరణ్ కుమార్ రెడ్డి నన్ను బెదిరిస్తుంటే వెనుక కూర్చున్న పొన్నాల కిస..కిస.. అంటూ నవ్వాడు!: హరీశ్ రావు

03-12-2018 Mon 13:17 | Both States
  • వైఎస్ ఈటల రాజేందర్ ను అవమానించారు
  • ‘పులిచింతల’కు ఉత్తమ్ జై కొట్టారు
  • మీడియా సమావేశం నిర్వహించిన హరీశ్
చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్ మెంట్ చేసినంత మాత్రాన ఆయన చేసిన పనులను ప్రజలు మర్చిపోరని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 2014లో అమరావతిలో ప్రమాణస్వీకారం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘తెలుగుజాతిని కలపగలిగే సత్తా టీడీపీకే ఉంది’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

బెర్లిన్ గోడ కూలి  రెండు జర్మనీలు ఒక్కటైనట్లు ఏపీ, తెలంగాణ తిరిగి కలుస్తాయని కాంగ్రెస్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు. ఇప్పుడు అదే రెండు పార్టీలు తెలంగాణలో అధికారం కోసం ఒక్కటయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.

‘హరీశ్.. నీ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో’ అని కిరణ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇస్తే.. వెనక కూర్చున్న అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య కిస.. కిస .. అంటూ నవ్వారని మండిపడ్డారు. తెలంగాణకు నష్టం చేకూర్చే పులిచింతల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి కట్టించారని ఆరోపించారు.

రాజేంద్ర (ఈటల రాజేందర్) ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్? అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ నేతను అవమానించారని దుయ్యబట్టారు. ‘తెలంగాణ ఇప్పుడు అవసరం లేదు. అభివృద్ధి జరిగాకే రాష్ట్రం తీసుకుంటాం’ అని అప్పటి నేత భట్టి విక్రమార్క సోనియా గాంధీకి లేఖ రాశారన్నారు. ఇలాంటి నేతలు అధికారం కోసం నేడు దిగజారి ఏకమయ్యారని మండిపడ్డారు.
TelanganaAndhra PradeshHarish RaoTRSHyderabadkiran kumar reddyPonnala LakshmaiahUttam Kumar ReddyCongressChandrababuTelugudesameetala rajendar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more