నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏమాత్రం లేదు.. ఎన్నికల్లో పట్టుబడుతున్నదంతా నల్లధనమే: తాజా మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రావత్

03-12-2018 Mon 13:04 | National
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది
  • గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ డబ్బు పట్టుబడింది
  • ఎన్నికల్లో ఉపయోగిస్తున్న సొమ్మంతా బ్లాక్ మనీనే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నోట్ల రద్దు ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని తాజా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. డీమానిటైజేషన్ తర్వాత ఎన్నికల్లో నల్లధనం వినియోగం తగ్గుముఖం పడుతుందని భావించారని... కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పట్టుబడుతున్న నల్లధనాన్ని చూస్తే... నోట్ల రద్దు ప్రభావం లేదని అనిపిస్తోందని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరింత ఎక్కువ ధనం పట్టుబడిందని తెలిపారు. ఎన్నికల్లో వినియోగిస్తున్న నల్లధనంపై నిఘా లేదని తెలిపారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్నవారికి డబ్బు లోటు లేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా వినియోగిస్తున్న భారీ సొమ్మంతా ముమ్మాటికీ బ్లాక్ మనీనే అని చెప్పారు.

గత వారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రావత్ రిటైర్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఒక పని చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు వినియోగం, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర న్యాయశాఖకు రెకమెండేషన్లు ఇవ్వలేకపోయానని చెప్పారు.

రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలలో పారదర్శకతను తీసుకురావడానికి చాలా కాలం పడుతుందని రావత్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఖర్చులపై ఒక సీలింగ్ ఉండాలనే విషయంపై ఆగస్టులో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించామని...  సీలింగ్ కు సంబంధించి అన్ని పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపైనే ప్రస్తుతం సీలింగ్ ఉందని... ఇదే సమయంలో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుపై సీలింగ్ లేదని అన్నారు. 
op rawatex cecblack moneydemonitisationelectionseffect

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more