నన్ను గెలిపిస్తే బాల్య వివాహాలు జరిపిస్తా.. రాజస్థాన్ బీజేపీ మహిళా అభ్యర్థి వివాదాస్పద హామీ
- బాల్య వివాహాలను దగ్గరుండి జరిపిస్తా
- పోలీసులు అడ్డుకోకుండా చూస్తా
- దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు
రాజస్థాన్లోని సోజత్ నియోజకవర్గం నుంచి శోభ చౌహాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం పీపాలియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తానని, పోలీసుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.