హోదాపై మాట్లాడితే చంద్రబాబు ఏజెంట్లు అంటారా?.. కన్నా ఖబడ్దార్: చలసాని
- కన్నా.. నోరు అదుపులో పెట్టుకో
- ఆరోపణలు వెనక్కి తీసుకో
- ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తోంది
ఏపీకి, తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బీజేపీకి ఉత్తర భారతదేశంపై ఉన్న శ్రద్ధ దక్షిణ భారతదేశంపై లేదని విమర్శించారు. యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీని దక్షిణాదిలో అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని చలసాని హెచ్చరించారు.