వెకిలి, నకిలీ సర్వేలను పట్టించుకోవద్దు: సీఎం కేసీఆర్
- మధుసూదనాచారిని లక్ష మెజార్టీతో గెలిపించాలి
- ఉద్యమం నాటి నుంచి ఆయన నాకు కుడిభుజం
- రాహుల్ గాంధీ బతుకే ‘కమీషన్’
తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మధుసూదనాచారి తనకు కుడిభుజంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. కమీషన్లు తీసుకున్నామని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్ బతుకే కమీషన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నాయకుల్లాగా తాము ఇసుక దందాలు చేయలేదని, తెలంగాణలో భూ కుంభకోణాలు, లంబకోణాలు లేవని, శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించిన కేసీఆర్, ఇప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కుతున్నారని దుయ్యబట్టారు. రైతులు ధనవంతులు అయ్యే వరకు ఆదుకునే బాధ్యత తనదని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసి తీరతానని మరోసారి స్పష్టం చేశారు.