సీక్వెల్ దిశగా కార్తీ సెన్సేషనల్ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీక్వెల్ దిశగా కార్తీ సెన్సేషనల్ మూవీ

  • ప్రయోగాత్మక చిత్రంగా 'యుగానికి ఒక్కడు'
  • చోళరాజుల నేపథ్యంలో సాగే కథ 
  • సీక్వెల్ చేసే ఆలోచనలో దర్శకుడు  
హిట్ చిత్రాలకి సీక్వెల్స్ రావడం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. 'రోబో' సినిమాకి సీక్వెల్ గా '2.ఓ'ను రూపొందించిన శంకర్, ఆ తరువాత కూడా గతంలో తాను చేసిన హిట్ చిత్రాలకి వరుసగా సీక్వెల్స్ తీసుకొచ్చే ఆలోచనలో వున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఒక సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు.

సెల్వరాఘవన్ తెరకెక్కించిన చిత్రాలలో 'యుగానికి ఒక్కడు' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. కార్తీ కెరియర్ ఆరంభంలో వచ్చిన సినిమా ఇది. అయినా ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు కార్తీకి స్టార్ డమ్ వచ్చింది కనుక, ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే మరింతగా ఆదరణ పొందుతుందనే నమ్మకంతో సెల్వరాఘవన్ వున్నాడట. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. త్వరలోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కనుందన్న మాట.   
karthi

More Telugu News