పుష్కర్ బ్రహ్మ ఆలయంలో తన కులం, గోత్రాన్ని వెల్లడించిన రాహుల్ గాంధీ!
Add ap7am to your home Screen

పుష్కర్ బ్రహ్మ ఆలయంలో తన కులం, గోత్రాన్ని వెల్లడించిన రాహుల్ గాంధీ!

  • రాహుల్ కులం కౌల్ బ్రాహ్మణ.. దత్తాత్రేయ గోత్రం
  • ఈరోజు పుష్కర్ బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన రాహుల్
  • పూజారి కోరిక మేరకు వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ అధినేత
తాను కౌల్ బ్రాహ్మణుడినని, తన గోత్రం దత్తాత్రేయ గోత్రమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్ లోని పుష్కర్ బ్రహ్మ ఆలయంలో ఈరోజు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోత్రం చెప్పాలని పూజారి అడిగిన నేపథ్యంలో... రాహుల్ తన వివరాలను వెల్లడించారు. తన కుటుంబానికి చెందిన పూర్వీకుల వివరాలను కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ తో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు.

మరోవైపు, రాహుల్ గాంధీ తన గోత్రం ఏమిటో వెల్లడించాలని గత కొంత కాలంగా బీజేపీ కోరుతోంది. గత నెలలో ఉజ్జయిని ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత సంబిట్ పాత్రా మాట్లాడుతూ, రాహుల్ జంధ్యం ధరిస్తే అది ఎలాంటిదో చెప్పాలని, ఆయన గోత్రాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi
caste
gothra
congress

More Telugu News