బాబు మాటలని సోనియా వల్లె వేసినట్టుంది : ఎంపీ కవిత

  • తెలంగాణ హక్కుల గురించి సోనియా మాట్లాడలేదు
  • పక్క రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడారు
  • సోనియాలా మేము ఢిల్లీలో ఒకటి, ఇక్కడ ఒకటి మాట్లాడం
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభలో ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోనియా ప్రసంగంలో తెలంగాణ హక్కుల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. కేవలం బాబు చెప్పిన అంశాలను సోనియా వల్లె వేసినట్లుందని విమర్శించారు. నేడు జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

 ఆంధ్రప్రదేశ్‌ అజెండాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్న కుట్ర జరుగుతోందన్న అనుమానం దీంతో కలుగుతోందని చెప్పారు. సోనియాగాంధీలాగా టీఆర్‌ఎస్‌ అధినాయకుడు కేసీఆర్‌గాని, మేముగాని ఢిల్లీలో ఒకటి, తెలంగాణలో ఒకటి మాట్లాడమని స్పష్టం చేశారు. ఎక్కడ మాట్లాడినా తెలంగాణ హక్కుల కోసమే మాట్లాడుతామని, అదే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఈనెల 26న జగిత్యాలలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Go Back to Shorts
MP kavitha
jagityala
Sonia Gandhi

More Telugu News