ఎవరికీ ఏమీ కాలేదు.. అందరం క్షేమంగానే ఉన్నాం: రాజశేఖర్
- కులూమనాలికి వెళ్తుండగా రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
- అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపిన రాజశేఖర్
- 10 రోజుల క్రితం అయిన గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడి
మరోవైపు 'కల్కి' షూటింగ్ సెట్లో 10 రోజుల క్రితం తాను గాయపడ్డానని రాజశేఖర్ తెలిపారు. ఓ స్టంట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయినా తాను విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపారు. ఈ సీక్వెన్స్ లో ఇతర నటులు కూడా పాల్గొంటున్నారని... తాను విశ్రాంతి తీసుకుంటే వారి డేట్స్ కు సంబంధించిన ఇబ్బందులు వస్తాయని చెప్పారు. క్రమంగా తాను కోలుకుంటున్నానని... కులూమనాలికి వెళ్తున్నానని తెలిపారు. ట్విట్టర్ ద్వారా రాజశేఖర్ ఈమేరకు వెల్లడించారు.