రాజకీయ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొత్త చిత్రం... డాలీ దర్శకత్వంలో మల్టీ స్టారర్?
- ఇప్పట్లో టాలీవుడ్ రిటైర్ మెంట్ లేనట్టే
- ప్రజలు మెచ్చే మాస్ లీడర్ గా కనిపించనున్న పవన్
- ఇటీవలే సినిమాలకు దూరమని చెప్పిన పవన్
- డాలీ తెచ్చిన స్క్రిప్ట్ విని మనసు పడ్డారంటున్న టాలీవుడ్
సమకాలీన రాజకీయాలను ప్రతిబింబిస్తూ, రాజకీయ వేడిని పెంచేలా ఈ సినిమా ఉంటుందని, ఇందులో పవన్ ప్రజలు మెచ్చే మాస్ లీడర్ గా 45 నిమిషాల పాటు కనిపిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో మరో యువ హీరోకు ఇందులో ప్రధాన పాత్ర ఉంటుందని, ఓ మల్టీ స్టారర్ గా చిత్రాన్ని మలచేందుకు టాప్ యంగ్ హీరోను డాలీ సంప్రదించారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.