ఏం జగన్, నువ్వు చెప్పు.. బైబిల్‌ను పట్టుకుని తిరుగుతావు కదా.. ఎందుకు దాని గురించి మాట్లాడవు?: పవన్ సూటి ప్రశ్న
- మద్యం నుంచే ప్రభుత్వానికి ఆదాయం
- మందిరాల వద్ద, మసీదుల వద్ద లిక్కర్ షాపులు
- జగనేమో రోడ్లు పట్టుకు తిరుగుతున్నారు
బైబిలును చేత పట్టుకుని తిరిగే జగన్ కూడా దీని గురించి మాట్లాడడం లేదన్నారు. ‘‘జగన్ చెప్పు.. బైబిలును మీరు చేతిలో పట్టుకుని తిరుగుతారు కదా? జీసస్‌ను గుండెల్లో పెట్టుకుని తిరుగుతారు కదా.. మరి చర్చిల వద్ద ఉండే బ్రాందీ షాపుల గురించి మీరెందుకు మాట్లాడడం లేదు’’ అని పవన్ సూటిగా ప్రశ్నించారు.
కన్నతల్లి లాంటి కన్న భూమిని గౌరవించాల్సిన జగన్ ‘జైహింద్’ అని, ‘భారత్ మాతాకీ జై’ అని అనడని పవన్ ఆరోపించారు. భారత్ మాతాకీ జై అనే పదం ప్రతి ఒక్కరిదీ అని, దానిపై బీజేపీకి పేటెంట్ హక్కు లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్ రోడ్ల మీద తిరుగుతున్నారని, ముఖ్యమంత్రిని చేస్తేనే అన్నీ చేస్తానని అంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు.