సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హిందీ 'అర్జున్ రెడ్డి' షూటింగులో కైరా
- బ్యాడ్మింటన్ కోర్టులో సుధీర్ బాబు
- లారెన్స్ 'కాంచన 3' విడుదల తేదీ
* ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ను ప్రాక్టీస్ చేస్తూ షూటింగుకి సన్నద్ధమవుతున్నాడు.
* ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు లారెన్స్ 'కాంచన 3' చిత్రం నిర్మాణం పనుల్లో బిజీగా వున్నాడు. లారెన్స్ ఇందులో నటించడమే కాకుండా, దీనికి దర్శకత్వం వహిస్తూ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 18న విడుదల చేస్తారు.