నా మార్క్ కామెడీనే నమ్ముకున్నాను: శ్రీను వైట్ల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా మార్క్ కామెడీనే నమ్ముకున్నాను: శ్రీను వైట్ల

  • మొదటి నుంచి కామెడీకే ప్రాధాన్యత 
  • మధ్యలో ఆ కామెడీని మిస్ చేశాను
  • మళ్లీ నా మార్క్ కామెడీతో వస్తున్నాను    
శ్రీను వైట్ల రూపొందించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా, ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నా సినిమాల విజయంలో కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. అయితే మధ్యలో నా మార్క్ కామెడీ రొటీన్ అవుతుందేమోననే కామెడీపాళ్లు తగ్గించి కొత్తగా ట్రై చేశాను. దాంతో ఆ సినిమాలు నిరాశ పరిచాయి.

నా సినిమాల్లో నా మార్క్ కామెడీనే ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని సన్నిహితులు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందువలన 'అమర్ అక్బర్ ఆంటోని' నా మార్క్  కామెడీతోనే నవ్విస్తారు. ఈ సారి ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.   
raviteja
iliana

More Telugu News