సీక్రెట్ చెప్పేసిన ఇలియానా .. షాక్ అయిన శ్రీను వైట్ల, రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీక్రెట్ చెప్పేసిన ఇలియానా .. షాక్ అయిన శ్రీను వైట్ల, రవితేజ!

  • కథ నచ్చడంతోనే రీ ఎంట్రీ ఇచ్చాను 
  • శ్రీను వైట్ల నాతో డబ్బింగ్ చెప్పించారు 
  • రవితేజ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారు
శ్రీను వైట్ల .. రవితేజ కాంబినేషన్లో రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా, ఈ నెల 16వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన ఇలియానా మాట్లాడుతూ, "ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం కథ నాకు బాగా నచ్చడమే. నాకు తెలుగు పెద్దగా రాకపోయినా నాతో శ్రీను వైట్ల డబ్బింగ్ చెప్పించారు. ఆయన సహకారం వల్లనే సాహసం చేశాను.

తెరపై నా వాయిస్ లో నన్ను నేను చూసుకోవాలనే ఆసక్తితో వున్నాను. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది .. రవితేజ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తారు" అని చెప్పేసింది. నిజానికి విడుదల వరకూ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుదామని శ్రీను వైట్ల - రవితేజ అనుకున్నారు. ఆ సీక్రెట్ ను కాస్తా ఇలియానా చెప్పేయడంతో రవితేజ - శ్రీను వైట్ల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.     
raviteja
iliana

More Telugu News