చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న మావోయిస్టుల హింస... మళ్లీ బాంబు దాడి
- పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఘటన
- దంతెవాడ జిల్లాలోని తమక్‌పాల్-నయనార్ రోడ్డులో ఘటన
- భద్రతా సిబ్బంది, పోలింగ్ అధికారులు క్షేమం
దంతెవాడ జిల్లాలోని తమక్‌పాల్-నయనార్ రోడ్డులో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో నక్సల్స్ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్ విధుల నిర్వహణకు వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ‘పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది క్షేమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు’ అని ఉన్నతాధికారులు తెలిపారు.