నేడు మీడియాతో మాట్లాడనున్న జగన్ తల్లి విజయమ్మ!
- నేటి ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్
- జగన్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడనున్న విజయమ్మ
- మీడియాకు అందిన ఆహ్వానాలు
గత నెలలో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆపై చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన వైఎస్ జగన్, రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తరువాత, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి పొందుతున్నారు. నేటి రాత్రి జగన్ తిరిగి విశాఖకు బయలుదేరనున్నారు. ఆపై రేపటి నుంచి తన ప్రజాసంకల్ప యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.