రవితేజ కొత్త చిత్రం టైటిల్ లోగో రిలీజ్ వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ కొత్త చిత్రం టైటిల్ లోగో రిలీజ్ వాయిదా

  • రిలీజ్ కి సిద్ధంగా రవితేజ - శ్రీను వైట్ల మూవీ
  • రవితేజ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వీఐ ఆనంద్ 
  • డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు
రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అమర్ అక్బర్ ఆంటోని' రెడీ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ లోగోను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.

అయితే 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా వున్నాడు. అందువలన వీఐ ఆనంద్ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ లోగో రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. 'అమర్ అక్బర్ ఆంటోని' రిలీజ్ అయిన తరువాతనే తమ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారట. నాభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. 
raviteja
naabha
payal

More Telugu News