నాలుగు రోజుల పాటు బ్యాంకుల మూత.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన!
- దీపావళి సందర్బంగా రెండ్రోజులు సెలవులు
- ఏటీఎంలలో నగదును లోడ్ చేస్తున్న అధికారులు
- సెలవుపై వెళ్లనున్న మెజారిటీ ఉద్యోగులు
దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో నగదును లోడ్ చేస్తున్నారు. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను వీలైతే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. శుక్రవారం బ్యాంకు తెరిచినా ఎక్కువమంది ఉద్యోగులు సెలవుపై ఉండే అవకాశముందని వెల్లడించారు. దీని కారణంగా బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయన్నారు.