నాగార్జున ఆ దర్శకులకు తేల్చి చెప్పేశాడట!

02-11-2018 Fri 14:25 | Entertainment
  • 'సోగ్గాడే' సీక్వెల్ గా 'బంగార్రాజు'
  • 'మన్మథుడు'కి సీక్వెల్ చేసే ఆలోచన 
  • నాగ్ ను మెప్పించలేకపోయిన కథలు    
నాగార్జున ఒక వైపున యువ కథానాయకులతో కలిసి మల్టీస్టారర్లు చేస్తూనే, మరో వైఫున సోలో హీరోగాను తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలోని 'బంగార్రాజు' పాత్రకి మంచి క్రేజ్ రావడంతో, అదే పేరుతో సీక్వెల్ చేయాలని ఆయన భావించాడు.

అయితే దర్శకుడు కల్యాణ్ కృష్ణ కథ విషయంలో నాగ్ ను మెప్పించలేకపోయాడట .. దాంతో నాగ్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక 'మన్మథుడు' సీక్వెల్ ను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేయాలని నాగార్జున భావించారు. ఇటీవల రాహుల్ వినిపించిన కథ .. తనకి సెట్ కాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు. చూస్తుంటే ఈ ప్రాజెక్టును కూడా నాగార్జున పక్కన పెట్టేసినట్టేనని చెబుతున్నారు. ఇక సోలో హీరోగా నాగ్ ను మెప్పించే కథను ఎవరు వినిపిస్తారో చూడాలి.    
nagarjuna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more