తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాలు.. లీకైన జాబితా ఇదిగో!

02-11-2018 Fri 07:22 | Telangana
  • 57 స్థానాలపై కాంగ్రెస్ ఏకాభ్రిప్రాయం
  • 8-9 తేదీల్లో తుది జాబితా విడుదల
  • మిగతా స్థానాలపై కుస్తీ
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ 95 స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించింది. టీడీపీకి 14, మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలకు చెరో ఐదు స్థానాలు కేటాయించాలని నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్న 95 స్థానాలకు గాను 57 స్థానాల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

మీడియాలో హల్‌చల్ చేస్తున్న దాని ప్రకారం.. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, కామారెడ్డి నుంచి షబ్బీర్‌ అలీ, బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి, బాన్సువాడ నుంచి కాసు బాలరాజు, నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, పినపాక నుంచి రేగ కాంతారావు, ములుగు నుంచి  సీతక్క, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి పోటీ చేస్తారు.

ఇక భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్‌, సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్ నుంచి ముఖేశ్‌ గౌడ్‌, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, ముషీరాబాద్ నుంచి అనిల్‌ యాదవ్‌, అచ్చంపేట నుంచి డాక్టర్‌ వంశీకృష్ణ, జడ్చర్ల నుంచి మల్లు రవి,  షాద్‌నగర్ నుంచి ప్రతాప్‌రెడ్డి పోటీ పడతారు.

ఇంకా మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, గజ్వేల్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజనరసింహ, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, సిద్ధిపేట నుంచి దరిపెల్లి చంద్రం బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాల విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఏకాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. మిగతా స్థానాలపైనా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈనెల 8, 9 తేదీల్లో తుది జాబితా ప్రకటించనున్నారు.
CongressTelanganaElectionsUttam Kumar ReddyTPCC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more