Rahul Gandhi: మోదీ వరం.. రాహుల్ ఫన్ మెషీన్: శివరాజ్ సింగ్ చౌహాన్
- రాహుల్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు
- జాతీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవు
- మధ్యప్రదేశ్ ఎన్నికలపై ‘రాఫెల్’ ప్రభావం ఉండదు
ఓ వైపు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ దేశ ప్రజలకు లభించిన ఓ వరం అన్న ఆయన, రాహుల్‌ను మాత్రం ఓ ఫన్ మెషీన్‌గా అభివర్ణించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ఆశీస్సులు, మద్దతు తమకు బలాన్ని చేకూర్చాయన్నారు.
మోదీ సమగ్రతపై ఎటువంటి సందేహం లేదన్నారు. రాహుల్ గురించి చౌహాన్ మాట్లాడుతూ.. ఆయనేం మాట్లాడతారో ఆయనకు తెలియదని.. అసలు జాతీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే ఆయనలో లేవన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికలపై రాఫెల్ వివాదం ప్రభావం చూపబోదన్నారు.