ఊహాజనిత తీర్పులు సరికాదు: మహిళకు విధించిన జైలు శిక్షను రద్దుచేసిన సర్వోన్నత న్యాయస్థానం

01-11-2018 Thu 12:42 | National
  • అనుమానాస్పద స్థితిలో భర్త మృతి చెందినా ఏడవ లేదని భార్యపై కేసు
  • ఆమే చంపేసి ఉంటుందన్న పోలీసుల వాదనతో ఏకీభవించి శిక్ష విధించిన గువాహటి న్యాయస్థానం
  • సరైన విచారణ లేకుండా తీర్పు ఇచ్చారని తప్పుపట్టిన సుప్రీం కోర్టు
భర్త మృతదేహం పక్కనే కూర్చున్నా ఆమె కంట కన్నీటి బొట్టు రాలలేదు. ‘ఆమె నేరం చేసిందనేందుకు ఇంతకంటే ఆధారం ఏం కావాలి?’ అంటూ పోలీసులు చూపిన అత్యుత్సాహం ఐదేళ్లపాటు ఆమెకు జైలు జీవితాన్ని మిగిల్చింది. కేసు తీర్పును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ‘లోతైన విచారణ లేకుండా ఊహాజనిత తీర్పులు ఇవ్వడం సరికాదు’ అని పేర్కొంటూ ఆమెకు విధించిన జైలు శిక్షను రద్దు చేసింది.

వివరాల్లోకి వెళితే... అసోంకు చెందిన ఓ మహిళ భర్త ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య కనీసం ఏడవక పోవడంతో పోలీసుల అనుమానం ఆమెపైకి వెళ్లింది. ఆమే కోపంతో చంపేసి ఉంటుందన్న అనుమానంతో అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు జైలు శిక్ష విధించింది.

నిజానిజాలు తెలుసుకోకుండా, సరైన దర్యాప్తు జరపకుండానే ఆమెకు శిక్ష విధించారంటూ బాధితురాలి తరపున ఆమె బంధువులు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన నారిమన్‌, నవీన్‌ సిన్హా ధర్మాసనం బుధవారం మహిళకు విధించిన శిక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. ‘మృతదేహం పక్కన కూర్చుని ఏడవనంత మాత్రాన ఆమె హంతకురాలు అనుకోవడం సరికాదు. ఆమె హంతకురాలు అనేందుకు సరైన ఆధారాలు లేవు. కావున తక్షణం విడుదల చేయండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళకు విముక్తి లభించింది.
Supreme Courtguvhati courtcase dissmissed

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more