‘జనసేన’ కు పవన్ తల్లి అంజనాదేవి విరాళం

30-10-2018 Tue 19:05 | Both States
  • ‘జనసేన’ కార్యాలయానికి వెళ్లిన అంజనాదేవి
  • మాతృమూర్తిని సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్
  • రూ.4 లక్షల విరాళపు చెక్కు పవన్ కు ఇచ్చిన తల్లి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తల్లి కొణెదల అంజనాదేవి ఆ పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళం అందజేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి ఈరోజు ఆమె వెళ్లారు. పవన్ కల్యాణ్ కు ఈ చెక్కును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు చెప్పారు.ఎందుకంటే, పోలీస్ ఉద్యోగం గురించి తనకు బాగా తెలుసని, తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశారని, తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాలో పని చేసేవారిని గుర్తుచేసుకున్నారు. ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కొణెదల వెంకట్రావుతో తనకు వివాహమైందని, ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు.

తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు
 
పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన తన మాతృమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్, ఆమె పాదాలకు నమస్కరించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను’ అని అన్నారు.
 
నాడు నాదెండ్ల ఉత్తర్వులతో మా కుటుంబానికి మేలు జరిగింది

అంజనాదేవికి జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నమస్కరించారు. నాడు నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వుల కారణంగా తమ కుటుంబానికి కలిగిన మేలును ఆమె గుర్తుచేసుకున్నారు. నాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్..  ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించారని,  నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే ఆ వయో పరిమితిని 58 ఏళ్లకు పెంచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వయోపరిమితి పెంచడంతో తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం నాడు లభించిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిన విషయమని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు.
jana senaanjanadeviPawan KalyanHyderabad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more