దేశ చరిత్రలో మొదటిసారి ఎన్నికల మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్ అమలుపరచింది: జగదీష్ రెడ్డి

30-10-2018 Tue 17:10 | Telangana
  • చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బంధీ అయింది
  • సూర్యపేటకు కృష్ణా జలాలను అందించిన ఘటన 
  • నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఆసరా టీఆర్‌ఎస్‌దే
సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్, చివ్వేంల మండలాల టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కుట్రలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందని విమర్శించారు. రాష్ట్ర రాజధానికి చేరుతున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్లు ఉదయ సముద్రానికి చేరుతున్న నీటిని మూసికి చేర్చి ఆ నీటితో మూసి నదిని ప్రక్షాళన చేసి సూర్యపేటకు మొట్టమొదటి సారిగా కృష్ణా జలాలను అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు.

ఇమాంపెట్ ఉండ్రుగొండ గుట్టలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో సూర్యాపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసి టీఆర్‌ఎస్ రికార్డు సృష్టించిందన్నారు. మ్యానిఫెస్టోలో లేని కళ్యాణలక్ష్మీ, అమ్మవడి, కేసీఆర్ కిట్, వసతి గృహంలో సన్నబియ్యం అన్నం వంటి విప్లవాత్మక పథకాలు అమలు పరిచామన్నారు. మొట్టమొదటిసారిగా నిరుద్యోగ భృతి ప్రకటించిన పార్టీ టీఆర్ఎస్ అని, నిరుద్యోగ యువతకు ఈ పథకం ఆసరా అవుతుందన్న విషయాన్ని  యువత దృష్టికి చేరేలా పార్టీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.

ఎన్నికలలో పార్టీ క్యాడర్, నాయకులు అనుసరించాల్సిన వ్యూహాన్నీ శ్రేణులకు నిర్ధేశించారు. కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించడంతోపాటు పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 90 శాతానికి పైబడి ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు సన్నద్దమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు.
JagadishreddyTRS

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more