హిజ్రాగా మారి దోపిడీలు చేస్తున్న హోంగార్డు.. కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు!

30-10-2018 Tue 11:20 | National
  • తమిళనాడులోని కడలూరులో ఘటన
  • స్నేహితులతో కలిసి దోపిడీలు
  • నిందితుడిపై వేటువేసిన పోలీస్ శాఖ
కంచె చేను మేసిన చందంగా ఓ హోంగార్డు తయారయ్యాడు. హిజ్రా వేషం వేసుకుని స్నేహితుడితో కలిసి ప్రజలను, వ్యాపారులను వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా కత్తితో ప్రజలను బెదిరించి దోపిడీలు చేయడం ప్రారంభించాడు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని పళైయ పాలం వద్ద రాజమోహన్ ఈ నెల 25న వాహనంపై వెళుతుండగా ఇద్దరు హిజ్రాలు ఆయన్ను అడ్డగించి కత్తితో బెదిరించారు. ఫోన్, పర్సును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై రాజమోహన్ పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. నిందితులు దోపిడీకి పాల్పడుతున్న మార్గంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న భరత్(26), సురేశ్(20)ను అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరినీ విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిజ్రాలుగా వేషం వేసుకుని ఈ మార్గంలో తాము దోపిడీలకు పాల్పడుతున్నట్లు భరత్, సురేశ్ అంగీకరించారు. గత రెండేళ్లుగా ఇలా దోపిడీలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరిలో భరత్ హోంగార్డుగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఈ ఘటన తెలుసుకున్న ఉన్నతాధికారులు భరత్ ను విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఇద్దరు దుండగులను కటకటాల వెనక్కునెట్టారు.
Tamilnaduhijrahome guardPolicearraestlootrobberytheftkadalurudistrict

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more