కేసీఆర్ ఉన్నాడు చాలని ప్రజలు ధీమాగా ఉన్నారు: మంత్రి హరీష్ రావు

29-10-2018 Mon 19:51 | Telangana
  • టీఆర్ఎస్ లో చేరిన ఆందోల్ కాంగ్రెస్ నేతలు
  • వర్షాల కోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు
  • సింగూరు ద్వారా తొలిసారిగా ఆందోల్ కే నీరిచ్చాం
వర్షాల కోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ ఉన్నాడు చాలు నీళ్లిస్తారని ప్రజలు ధీమాగా ఉన్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. హరీశ్ రావు సమక్షంలో ఆందోల్ కు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి లు తమ పార్టీలో చేరడం సంతోషకరమని, వారిని చూస్తుంటే ఆందోల్ పెద్ద చెరువు నిండినట్టుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగూరు ద్వారా మొట్టమొదటిసారిగా ఆందోల్ నియోజకవర్గానికే  నీళ్లు ఇచ్చామని గుర్తుచేసుకున్నారు. సింగూరు ద్వారా ఆందోల్ లో లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.

ఈ సంద్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ‘యెడ్డెమంటే తెడ్డెం’ అనే రకం ‘కాంగ్రెస్’ అని, తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి పథకాన్ని బంద్ చేస్తామని ఆ పార్టీ అంటోందని, అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుని రద్దు చేస్తామని కూడా ‘కాంగ్రెస్’ అనొచ్చని ప్రశ్నించారు. చంద్రబాబు పాటే కాంగ్రెస్సోళ్లు పాడుతున్నారని విమర్శించారు.

టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తారా? లేక రాష్ట్రాభివృద్ధి కోసం మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కడతారా? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో అధికారం మారబోతోందన్న అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తోందని, ముందు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బీజేపీ గెలుస్తుందో లేదో చూసుకోండని ఆయన సెటైర్లు వేశారు.
kcrHarish RaoChandrababuTelugudesamCongress

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more