నేడు కాంగ్రెస్‌లో చేరనున్న డీఎస్.. మరికొందరు తెలంగాణ నేతలు కూడా!

  • నేటి ఉదయం ఢిల్లీలో రాహుల్‌తో భేటీ కానున్న డీఎస్
  • కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న నర్సారెడ్డి, రాములు నాయక్
  • ఆర్.కృష్ణయ్యకు పిలుపు
గత కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆయనతోపాటు తెలంగాణకు చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

 డీఎస్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, డీఎస్ అనుచరులు పలువురు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు డీఎస్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని ఢిల్లీ పెద్దల సమాచారం. అలాగే, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు కూడా నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు.

తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న టి.నర్సారెడ్డి పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న మనస్తాపంతో ఉన్నారు. నారాయణ్‌ఖేడ్ టికెట్ ఆశించి భంగపడిన రాములు నాయక్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా నేడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్టు సమాచారం.  
Go Back to Shorts
DS
Telangana
TRS
Congress
Rahul Gandhi
R.krishnaiah
Ramulu Naik
Narsa Reddy

More Telugu News