తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దారుణంగా చంపేసిన తనయులు!

  • తల్లి వివాహేతర సంబంధంతో కొడుకుల మనస్తాపం
  • అడ్డు తొలగించుకునేందుకు హత్యకు కుట్ర
  • కిరాతకంగా చంపేసిన నిందితులు
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్యచేశారు ఆమె తనయులు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీసుల కథనం ప్రకారం.. రహేమత్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత అరబ్‌ దేశంలో ఉంటోంది. ఆమెకు మహ్మద్ సోహెల్ (23), మహ్మద్ సులేమాన్ (21) అనే కొడుకులున్నారు. తన భర్తకు అక్క కొడుకైన జావిద్ (33)తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసిన ఆమె భర్త, పిల్లలు మందలించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో విసుగు చెందిన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.

తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి మరో వ్యక్తికి దగ్గర కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారులు జావిద్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. సవతి తల్లి కుమారుడైన మహ్మద్ ఈసా (21)లో కలిసి జావిద్ హత్యకు కుట్ర పన్నారు. గురువారం రాత్రి వివాహిత అరబ్ నుంచి కుమారుల కోసం జావిద్ ద్వారా డబ్బులు పంపింది. ఆ డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన జావిద్‌పై ముగ్గురూ మారణాయుధాలతో దాడిచేశారు. గొంతు, కడుపులో కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. అనంతరం అతడి మర్మాంగాలు కోసం హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Hyderabad
Old city
Murder
Arab
illegal affair

More Telugu News