కౌశల్ కి ఆ తరహా విలన్ పాత్రలు చేయాలనుందట!

  • 'ధ్రువ'లో విలన్ పాత్రను మరిచిపోలేం 
  • 'అరవింద'లో జగపతి పాత్ర అద్భుతం 
  • నన్ను నేను నిరూపించుకోవాలని వుంది    
నిన్న మొన్నటి వరకూ కౌశల్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. 'బిగ్ బాస్ 2' తరువాత కౌశల్ అంటే తెలియనివాళ్లు చాలా తక్కువ మంది వుంటారు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన అంతగా పాప్యులర్ అయ్యాడు. ఈ క్రేజ్ తో ఆయన వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు. తాను విలన్ పాత్రలకి బాగా పనికొస్తానని ముందుగానే చెప్పిన కౌశల్, మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఆ మధ్య వచ్చిన 'ధ్రువ' సినిమాలో విలన్ గా అరవిందస్వామి చేసిన పాత్రను అంత తేలికగా మరిచిపోలేం. అలాగే రీసెంట్ గా వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో విలన్ గా జగపతిబాబు పోషించిన పాత్ర కూడా అద్భుతం. అలాంటి విలన్ పాత్రలు చేయాలనుంది .. ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అని కౌశల్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.  
Go Back to Shorts
kaushal

More Telugu News