కాంగ్రెస్ తో రహస్య చర్చలు.. ఎమ్మెల్సీ రాములు నాయక్ ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్!
- నిన్న కాంగ్రెస్ నేతలతో నాయక్ భేటీ
- ఇల్లందు సీటుపై హామీ ఇచ్చిన కాంగ్రెస్
- మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం
టీఆర్ఎస్ పార్టీ నుంచి నారాయణ ఖేడ్ టికెట్ ను రాములు నాయక్ ఆశించారు. అయితే ఈ టికెట్ ను సీఎం కేసీఆర్ ఎం.భూపాల్ రెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలో రాములు నాయక్ నిన్న కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ లో చేరితే అసెంబ్లీ టికెట్ ఇస్తామని తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జ్ కుంతియా హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, వేటు నేపథ్యంలో మరికాసేపట్లో రాములు నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో రాములు నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశముందని భావిస్తున్నారు.