'ఆకు చాటు పిందె తడిసె'.. బాలయ్యతో కలసి ఉర్రూతలూగించనున్న రకుల్ ప్రీత్ సింగ్

  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్
  • శ్రీదేవి పాత్రను పోషించనున్న రకుల్
  • శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్
దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రం 'కథానాయకుడు', 'మహా నాయకుడు' పేర్లతో రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో స్టార్లు నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రంలో మెరవబోతోంది. శ్రీదేవి క్యారెక్టర్ ను ఆమె చేయబోతోంది.

'వేటగాడు' చిత్రంలోని 'ఆకు చాటు పిందె తడిసె' సాంగ్ లో బాలయ్యతో కలసి రకుల్ రంజింపజేయబోతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానున్నాయి.
Go Back to Shorts
ntr
biopic
Balakrishna
rakul preet singh
sridevi
tollywood

More Telugu News