సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • '96' రీమేక్ లో కూడా త్రిష?
  • చరణ్ సినిమాకి సరికొత్త టైటిల్ 
  • సూపర్ హిట్ రీమేక్ లో రమ్యకృష్ణ 
*  త్రిష, విజయ్ సేతుపతి జంటగా ఇటీవల తమిళంలో వచ్చిన '96' చిత్రానికి అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా విడుదల కాకుండానే దీని తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ రీమేక్ లో కూడా త్రిషను నాయికగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
*  రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి టైటిల్ కోసం కసరత్తు జరుగుతోంది. మొదట్లో 'స్టేట్ రౌడీ' అని, ఆ తర్వాత 'తమ్ముడు' అనీ కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా 'వినయ విధేయ రామ' అనే క్లాస్ టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
*  తెలుగులో ఘన విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని శింబు హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్ లో నదియా నటించిన కీలకమైన పాత్రను తమిళంలో రమ్యకృష్ణ చేయనున్నట్టు తాజా సమాచారం.
Trisha
charan
nadiya
ramyakrishna

More Telugu News