నాలుగేళ్లూ మోదీ చంకలోనేగా చంద్రబాబు ఉంది: కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • మోదీ కాలు మొక్కి 7 మండలాలు గుంజుకున్నావు
  • నీకు ఒకటి రెండు వార్తా సంస్థలు డబ్బా కొడుతున్నాయి
  • మాతోను గెలుకున్నావు జాగ్రత్త!
 నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటైపోయారని చంద్రబాబు ఆరోపణలు చేయడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘నాలుగేళ్లూ ఆయన (మోదీ) చంకలోనే ఉన్నావు కదా!.. నేను లేను కదా? నరేంద్ర మోదీ కాలు మొక్కి కదా నా ఏడు మండలాలు గుంజుకున్నావు.. నరేంద్రమోదీని అడ్డంపెట్టుకని గదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు.. నరేంద్ర మోదీని అడ్డు పెట్టుకుని గదా హైకోర్టు విభజన కానివ్వలేదు. ఇవి వాస్తవాలు కాదా?

ఈ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి రెండు వార్తా సంస్థలు. వాటిని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయగల్గుతాననుకుంటున్న చంద్రబాబునాయుడు.. మాతోను గెలుకున్నావు జాగ్రత్త! తెలంగాణ దెబ్బ ఏంటో ఒకసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్. మా బతుకులేదో మేము బతుకుతున్నాం.. ’ అంటూ చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. 
Go Back to Shorts
KCR
Chandrababu
nalgonda

More Telugu News