కేసీఆర్ కు చంద్రబాబు భయం పట్టుకుంది!: సోమిరెడ్డి
- చంద్రబాబును తిడితే ఓట్లు పడతాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు
- మోదీ నుంచి కేసీఆర్ వరకు అందరూ చంద్రబాబుకు భయపడుతున్నారు
- తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
చంద్రబాబు వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందనే కేటీఆర్ వ్యాఖ్యలను కేసీఆర్ మరిచిపోయారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ వల్లే కేసీఆర్ ఒక రాజకీయ నేతగా ఎదిగారని... ఆయన మంత్రివర్గంలో ఉన్న సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనని... ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందనే నిజాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని తెలిపారు.