తాను గర్భవతిని అంటూ ప్రకటించిన టెన్నిస్ తార మార్టినా
Add ap7am to your home Screen

తాను గర్భవతిని అంటూ ప్రకటించిన టెన్నిస్ తార మార్టినా

  • పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన స్విస్ టెన్నిస్ తార
  • వచ్చే పుట్టినరోజుకు మా ఇంట్లో ముగ్గురుంటారన్న మార్టినా
  • ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ హింగిస్
ప్రస్తుతం తాను గర్భవతిని అంటూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్ ప్రకటించింది. తన 38వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ అనౌన్స్ మెంట్ చేసింది. వచ్చే పుట్టినరోజుకల్లా తమ కుటుంబం ముగ్గురు సభ్యులతో ఉంటుందని తెలిపింది. హరాల్డ్ లీమన్ అనే మాజీ స్పోర్ట్స్ ఫిజీషియన్ ను హింగిస్ పెళ్లాడింది.

'మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సెలబ్రేషన్స్ ను జంటగా జరుపుకోవడం ఇదే చివరిసారి అని చెప్పడానికి సంతోషిస్తున్నా. మా కుటుంబం ముగ్గురికి పెరుగుతోందని ఎంతో ఎగ్జైటింగ్ గా చెబుతున్నా' అంటూ ట్వీట్ చేసింది.

హింగిస్ తన కెరీర్లో ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. 209 వారాల పాటు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో కొనసాగింది. 23 ఏళ్ల తన సుదీర్ఘమైన కెరీర్ కు 2017లో ఆమె ముగింపు పలికింది. అయితే ఇంతకు ముందే ఆమె రెండు సార్లు రిటైర్ కావడం గమనార్హం. 2003లో 22 ఏళ్ల వయసులో తొలిసారి రిటైర్ అయింది. 2007 నవంబర్ లో తుంటి ప్రాంతంలో గాయం కావడం.. డోపింగ్ టెస్టులో కొకైన్ ఆనవాళ్లు బయటపడటంతో మరోసారి రిటైర్మెంట్ తీసుకుంది. 
martina hingis
tennis
switzerland
pregnant

More Telugu News