కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించింది.. అందుకే బురద జల్లుతోంది: మోదీ
- దేశానికి కాంగ్రెస్ భారంగా మారింది
- కమలంపై ఎంతగా బురద జల్లితే అంతగా వికసిస్తుంది
- చివరికి చిన్న పార్టీల మద్దతు కోరే స్థాయికి దిగజారింది
దేశానికి భారంగా మారిన కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని కాపాడడం బీజేపీ కార్యర్తల బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. దేశం వెలుపలి శక్తుల మద్దతు కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ చివరికి చిన్న పార్టీల మద్దతు కోరే స్థాయికి దిగజారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.