కులుమనాలిలోనే 'దేవ్' సినిమా టీమ్: కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కులుమనాలిలోనే 'దేవ్' సినిమా టీమ్: కార్తీ

  • నేను చెన్నై కి వచ్చేశాను 
  • మిగతా టీమ్ అక్కడే వుంది 
  • వరదలు తొందరగా తగ్గాలి
కార్తీ హీరోగా తమిళంలో 'దేవ్' సినిమా రూపొందుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు కులుమనాలిలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఈ సినిమా టీమ్ అక్కడ చిక్కుబడినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని గురించి హీరో కార్తీ స్పందించాడు.

ఆల్రెడీ తాను మరికొందరితో కలసి చెన్నైకి వచ్చేశాననీ, దర్శకుడు .. సినిమాటో గ్రాఫర్ తో పాటు మిగతా టీమ్ మాత్రం అక్కడే ఉండిపోయిందని, వారంతా క్షేమంగానే వున్నారని ఆయన పేర్కొన్నారు. కరెంట్ సరఫరా లేకపోవడం వల్ల, రోడ్డు మార్గం పాడైనందువల్ల మరో రోజు తర్వాతే వారు వస్తారని కార్తీ చెప్పారు.

"సాధ్యమైనంత త్వరగా వరదలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  
karthi
rakul

More Telugu News