టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్థ ఆలోచనతో ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ పేదలకు అందట్లేదు: అమిత్ షా
Add ap7am to your home Screen

టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్థ ఆలోచనతో ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ పేదలకు అందట్లేదు: అమిత్ షా

  • ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ గొప్పది 
  • తెలంగాణ పేదలకు దీని ప్రయోజనాలు దక్కట్లేదు 
  • దీనిపై టీ-ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం చాలా గొప్పదని, అయితే, ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్థ ఆలోచన కారణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రయోజనాలను పొందలేకపోతున్నారని, దీనిపై ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. పేదల వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కార్యకర్తలు నిలదీయాలని పిలుపు నిచ్చారు.  
amitshah
Telangana

More Telugu News