మళ్లీ కన్ను కొట్టిన రాహుల్ గాంధీ.. ఈసారి మద్యప్రదేశ్‌లో!
- మధ్యప్రదేశ్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం
- భోపాల్‌లో టీ బ్రేక్
- సెల్ఫీల కోసం పోటెత్తిన అభిమానులు
రాహుల్ టీ బ్రేక్‌కు ఆగడంతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడ్డారు. రాహుల్ నవ్వుతూ సెల్ఫీలకు పోజిచ్చారు. అందరినీ విష్ చేస్తూ హుషారుగా కనిపించారు. ఈ సందర్భంగా తనను పలకరించిన అభిమానులకు అభివాదం చేస్తూ రాహుల్ కన్ను కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ప్రచారంలో రాహుల్ వెంట జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్ వంటి నేతలు ఉన్నారు.