కౌశల్ పై దృష్టి పెట్టిన బోయపాటి శీను?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కౌశల్ పై దృష్టి పెట్టిన బోయపాటి శీను?

  • 'బిగ్ బాస్ 2' హౌస్ లో కౌశల్ 
  • కుర్రకారులో పెరుగుతోన్న క్రేజ్
  • మంచి పాత్రలు దక్కే ఛాన్స్  
'బిగ్ బాస్ 2' షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల నుంచి అత్యధిక మార్కులు కొట్టేసిన కంటెస్టెంట్ గా కౌశల్ కనిపిస్తున్నాడు. 'బిగ్ బాస్ హౌస్' లో ఒక సభ్యుడిగా కనిపిస్తూనే తనదైన స్టైల్ తో ఆయన కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్నాడు. 'బిగ్ బాస్ 2' పూర్తయిన తరువాత కౌశల్ కి వరుస సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మోడలింగ్ రంగంనుంచి వచ్చిన కౌశల్ గతంలో కొన్ని సీరియల్స్ లోను .. సినిమాల్లోను నటించాడు.

అయితే ఈసారి ఆయనకి మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కౌశల్ పై దర్శకుడు బోయపాటి శీను దృష్టిపెట్టినట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి చేయబోయే సినిమాలో విలన్ పాత్ర గానీ .. నెగెటివ్ షేడ్స్ కలిగిన మరో పాత్రగాని కౌశల్ కి లభించవచ్చని అనుకుంటున్నారు. ఆల్రెడీ బోయపాటి టీమ్ కౌశల్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
boyapati
kaushal

More Telugu News