ఢిల్లీ సామూహిక మరణాల కేసులో ట్విస్ట్: ఆత్మహత్యలు కాదంటున్న ఫోరెన్సిక్ నివేదిక

15-09-2018 Sat 19:07 | National
  • 11 మంది కుటుంబ సభ్యుల సామూహిక మరణాలు 
  • విస్తుగొలిపే నిజాన్ని వెల్లడించిన ఫోరెన్సిక్ నివేదిక
  • మోక్షం కోసం క్రతువు నిర్వహిస్తుండగా ప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఆమధ్య ఒకే కుటుంబానికి చెందిన 11 మంది విగతజీవులై కనిపించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉదంతంలో విస్తుగొలిపే నిజం ఒకటి ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెల్లడైంది. పోలీసులు తొలుత భావించినట్టుగా ఆ కుటుంబానిది ఆత్మహత్య కాదని తేలింది. జూలై 1న బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్ దేవీ సహా 10 మంది కుటుంబసభ్యులు విగత జీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ ఇంట్లో లభ్యమైన ఆధారాలను బట్టి వీరంతా సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఈ కేసులో 'సైకలాజికల్ అటాప్సీ' (ఆత్మహత్య చేసుకున్న వారి గురించి లోతైన మానసిక విశ్లేషణ) నిర్వహించాలని న్యూఢిల్లీ పోలీసులు సీబీఐని కోరడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను పోలీసులకు సీబీఐ అందించింది. ఈ నివేదిక ద్వారా బురారీ కుటుంబం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యలకు పాల్పడలేదని.. అసలు ఆ కుటుంబంలో ఎవరికీ చనిపోవాలన్న ముందస్తు ఆలోచనే లేదనే విషయం వెల్లడైంది. మోక్షం కోసం క్రతువు నిర్వహిస్తుండగా, అందులో సూచించిన విధానాన్ని వారు అనుసరించడంతో జరిగిన ప్రమాదం కారణంగానే వారంతా చనిపోయినట్టు సైకలాజికల్ అటాప్సి నివేదికలో పేర్కొన్నారు. ఆ ఇంట్లో లభించిన ఆయా వ్యక్తుల నోట్ పుస్తకాలు, డైరీలను లోతుగా విశ్లేషించడంతో పాటు, వారి స్నేహితులను, బంధువులను ఇంటర్వ్యూలు చేసి సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ నివేదికను రూపొందించింది.  ఆ కుటుంబానికి చెందిన పెద్ద కొడుకు దినేశ్ సింగ్, అతని సోదరి సుజాత నెగ్ పాల్ ను కూడా ఈ నివేదిక కోసం ఇంటర్వ్యూ చేయడం జరిగింది.    
forensic reportNew Delhi

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more