ఉత్తమ్ సహా హస్తిన చేరిన 50 మంది కాంగ్రెస్ నేతలు... రాహుల్ తో కీలక సమావేశం!
- టీడీపీతో పొత్తుపై రాహుల్ కు వివరణ
- కాంగ్రెస్ లో చేరనున్న బండ్ల గణేష్, భూపతిరెడ్డి
- పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్
వీరంతా మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై, పొత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి? ఇతర కలిసొచ్చే పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎక్కడ ఎవరు పోటీ పడాలి? తదితర విషయాలపై రాహుల్ కు తమ ఆలోచనలను వివరించనున్న నేతలు, ఆయన సలహా, సూచనలు తీసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, ఈ సమావేశంలోనే నిర్మాత బండ్ల గణేష్, భూపతిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. ఆపై టీడీపీ నేతలతో చర్చించి, పొత్తుపై అధికారిక ప్రకటన వెలువరిస్తారని సమాచారం.